Wednesday, May 6, 2026
Home Blog Page 21

ప్రజావాణి దరఖాస్తులపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

0

ఏ టు టీవీ న్యూస్ మార్చి 23 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అందుతున్న దరఖాస్తులను అధికారులు జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం _దరఖాస్తులు స్వీకరించారు.ఈ దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే సోమవారం జరిగే ప్రజావాణి నాటికి అన్ని దరఖాస్తులు పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సమస్యల పరిష్కారం కోసం ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తున్నందున, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం కనబరిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డి.ఆర్.డి.ఓ పి.డి శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

చముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ – ప్రత్యేక పూజలు

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ఆదివారం నాడు చముండేశ్వరి అమ్మవారిని ఘనంగా దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ పూజారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ వాతావరణంలో కొంతసేపు గడిపిన అదనపు ఎస్పీ, అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు.అనంతరం ఆయన ఆలయ పరిసరాలను పరిశీలించి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

సిద్దిపేటలో భారీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ఆయన, రూ.50 కోట్లతో నిర్మించనున్న రిఫైనరీకి శంకుస్థాపన చేశారు.అదేవిధంగా, మొత్తం రూ.475 కోట్ల 72 లక్షల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన రైతు మహోత్సవం బహిరంగ సభలో సుమారు 30 వేల మంది రైతులు పాల్గొన్నారు. సభలో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,600 కోట్ల రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేశారు.అనంతరం భారీ సభను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి, కార్యక్రమం ముగిసిన తర్వాత హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరారు.

పిల్లికోట్టల్ డబుల్ బెడ్రూమ్స్ కాలనీలో సమస్యలు – మార్చి 24న ధర్నా

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ పట్టణంలోని 12వ వార్డు పిల్లికోట్టల్ డబుల్ బెడ్రూమ్స్ కాలనీ సమస్యలకు నిలయంగా మారిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య అన్నారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 24న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.సిపిఎం ప్రతినిధి బృందం కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంది. నాలుగు ఏళ్ల క్రితం ఇండ్లు కేటాయించినప్పటికీ మౌళిక సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మంచినీటి సరఫరా తక్కువగా ఉండటంతో పాటు బోర్ చెడిపోయి సంవత్సరం గడిచినా మరమ్మతులు చేయలేదన్నారు.ఇండ్ల నిర్మాణం నాసిరకంగా ఉండి వర్షాల సమయంలో నీళ్లు కారుతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ భద్రతా కంచెలు లేక ప్రమాదం ఉందని తెలిపారు. ఖాళీగా ఉన్న ఇండ్లను పేదలకు వెంటనే కేటాయించాలని, లేకపోతే ఆక్రమించుకుంటామని హెచ్చరించారు.కాలనీలో పార్కులు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని, అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు – భారీగా రైతుల తరలింపు, ఏర్పాట్లు పూర్తి

0

ఏ2టీవీ న్యూస్ మార్చి 21 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన రైతు ఉత్సవాల్లో మెదక్ జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె వివరాల ప్రకారం, మెదక్ జిల్లా పరిధిలోని 21 మండలాలకు చెందిన రైతులను నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో జరుగుతున్న రైతు ఉత్సవాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 2,650 మంది రైతులను 53 బస్సుల ద్వారా తరలించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే కార్యక్రమం తొలి దశలో భాగంగా మార్చి 20న 10 మండలాలకు చెందిన 500 మంది రైతులను 10 బస్సుల ద్వారా తరలించగా, మార్చి 21న మరో 10 మండలాలకు చెందిన 500 మంది రైతులను కార్యక్రమ స్థలానికి పంపినట్లు వెల్లడించారు.ఈ ఉత్సవాల్లో పాల్గొన్న రైతులు వ్యవసాయ మరియు అనుబంధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో సాంకేతిక చర్చలు జరిపి ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పొందారు. అలాగే ఉత్తమ రైతుల అనుభవాలను తెలుసుకుని తమ వ్యవసాయంలో అమలు చేయదగిన పద్ధతులను అవగాహన చేసుకున్నట్లు తెలిపారు.అదనంగా, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ శాఖలకు చెందిన అధునాతన సాంకేతిక ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుంటున్నారని పేర్కొన్నారు.ఇక మార్చి 22న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మరియు ఆయిల్ ఫామ్ రిఫైనరీ శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రైతులను పెద్ద ఎత్తున తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్పష్టం చేశారు.

మెదక్ జిల్లాలో జూదంపై పోలీసుల దాడులు తీవ్రం

0

ఏ2టీవీ న్యూస్, మార్చి 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

నలుగురు అరెస్ట్ – ఇద్దరు పరారీలోరూ.4,750 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనంమెదక్ జిల్లా చిల్పిచేడ్ మండలం సిలంపల్లి గ్రామ శివారులో అక్రమంగా జూదం నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు.విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని జూదం ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన వారిలో వెంకటాపురం లక్ష్మణ్, జుకంటి లోకయ్య, మన్నె ప్రసాద్, యల్లయ్యగారి భూమ్ రెడ్డి ఉన్నారు. కాగా, రాకేష్ మరియు పెద్దొల్ల సుధాకర్ రెడ్డి పరారీలో ఉన్నారు.ఈ ఘటనలో సంఘటనా స్థలం నుంచి రూ.4,750 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చిల్పిచేడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.జిల్లాలో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

టేక్మల్‌లో అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మిక తనిఖీలు

0

ఏ2టీవీ న్యూస్, మార్చి20,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

టేక్మల్ మండల కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఆగ్రో సేవా కేంద్రం, గ్యాస్ గోదాం పరిశీలించగా, అనంతరం కేజీవీబీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలలో స్టోర్ రూమ్, కిచెన్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఉచిత విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.ఆగ్రో సేవా కేంద్రంలో రికార్డులు, స్టాక్ వివరాలు పరిశీలించిన ఆయన… రైతులకు ఎరువులు, మందులు అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా యూరియా సరఫరాను వేగవంతం చేయాలని అన్నారు.గ్యాస్ గోదాంలో పరిస్థితులను సమీక్షిస్తూ… జిల్లాలో గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.గ్యాస్ సమస్య సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భరోసా సెంటర్‌కు 200 మెడికల్ కిట్లు అందజేసిన ప్లాన్ ఇండియా

0

ఏ2టీవీ న్యూస్, మార్చి18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్‌కు ప్లాన్ ఇండియా ఎన్‌జీఓ 200 మెడికల్ కిట్లను అందజేసింది. ఈ కార్యక్రమం అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సమక్షంలో జరిగింది.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ భరోసా సెంటర్‌ను సందర్శించి, రికార్డులు, సిబ్బంది పనితీరు, పోక్సో కేసుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. లైంగిక వేధింపుల బాధితులకు భరోసా సెంటర్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.బాధితులకు తక్షణ వైద్య, న్యాయ సహాయం అందించడంతో పాటు మానసిక ధైర్యం కల్పించాలని సిబ్బందికి సూచించారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు.ప్లాన్ ఇండియా అందజేసిన ఈ మెడికల్ కిట్లు వైద్య పరీక్షల్లో ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ఈ సహకారం అందించిన ఎన్‌జీఓకు భరోసా సెంటర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భరోసా కోఆర్డినేటర్ సౌమ్య, ప్లాన్ ఇండియా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ కార్యక్రమం

0

ఏ2టీవీ న్యూస్, మార్చి18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

కొల్చారం:మండలంలోని పోతంశెట్టిపల్లి మరియు రంగంపేట రైతు వేదికల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయం పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు మండలంలో నాలుగు క్లస్టర్లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. కొల్చారం, హంసానిపల్లి, పోతంశెట్టిపల్లి, ఎనగండ్ల గ్రామాలను క్లస్టర్లుగా గుర్తించి, ప్రతి క్లస్టర్‌లో 125 మంది రైతులను ఎంపిక చేసి శిక్షణ అందించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లు మరియు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. సంబంధిత క్లస్టర్ మండల వ్యవసాయ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతివేగం.. అశ్రద్ధ.. అనర్థం

0

“సజీవంగా చేరుకోండి” కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన

ఒక్కరి నిర్లక్ష్యం కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2టీవీ న్యూస్, మార్చి 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

శంకరంపేట్-ఆర్ మండలంలో మంగళవారం ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సజీవంగా చేరుకోండి” కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఒక్కరి నిర్లక్ష్యం మొత్తం కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.దేశవ్యాప్తంగా ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా వివరించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణాల శాతం పెరుగుతోందని, ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు.గత ఏడాది జిల్లాలో నిర్వహించిన వాహన తనిఖీల ద్వారా 69 మరణాలను నివారించగలిగామని తెలిపారు. లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.కుటుంబ యజమానిని కోల్పోతే ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. “ప్రమాదం చెప్పి రాదు.. జాగ్రత్తే దానికి విరుగుడు” అని ఎస్పీ పేర్కొన్నారు.