ఏ2డిజిటల్ న్యూస్, మే9, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామ వి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు దుర్గం విట్టల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి ఫ్రాక్చర్ కాగా విషయాన్ని తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆసుపత్రి ఖర్చులను యిప్పించడం జరుగుతుందని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, మండల పార్టీ యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, కార్యకర్తలు ముల్లెల ఆంజనేయులు, ఉషికే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఏ2డిజిటల్ న్యూస్ మే8, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ గా కోర్టు తీర్పు మేరకు శుక్రవారం మనోహర్ చైర్మన్, వైస్ చైర్మన్ ,డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన పాలకవర్గానికి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు సొసైటీ పాలకవర్గం సభ్యులు కొమ్ముల యాద గౌడ్ , సంజీవులు, అశోక్ గౌడ్, సీఈవో కృష్ణ , పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-చైర్మన్ చిన్నారపు ప్రభాకర్, వైస్ చైర్మన్ ముత్యం గారి గోవర్ధన్
ఏ2డిజిటల్ న్యూస్, మే8, సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)
కొల్చారం మండలంలోని వరిగుంతం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా చిన్నారపు ప్రభాకర్ ,వైస్ చైర్మెన్ గా ముత్యంగారి గోవర్ధన్ ను ప్రభుత్వం తిరిగి కొనసాగిస్తున్న సందర్భంగా మిత్రబృందం సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుట్టగల్ల మోహన్, ఉప సర్పంచ్ బాంచ వీరేశం, మాజీ సర్పంచ్ అక్కంగారి శ్రీదర్ గౌడ్, సొసైటీ సి ఈ ఓ చిన్నారపు రాములు, సాజిద్ ఖాన్ సొసైటీ డైరెక్టర్ లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఏ2డిజిటల్ న్యూస్, మే 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
రైతుల సంక్షేమమే లక్ష్యంగా మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లాలో ధాన్యం కొనుగోలు, రవాణా, నిల్వ అంశాలపై చేపడుతున్న చర్యలను వివరించారు.జిల్లా వ్యాప్తంగా 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటివరకు జిల్లాలో 67,489.480 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో రూ.62.87 కోట్లను జమ చేసినట్లు వెల్లడించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో కొనుగోలు మరియు రవాణా ప్రక్రియ కొనసాగిస్తున్నామని చెప్పారు.జిల్లా నుంచి రోజుకు సుమారు 480 లారీల ద్వారా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. అయితే, వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో హమాలీల కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే తడిసిన ధాన్యాన్ని త్వరగా ఆరబెట్టి రైస్ మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పారు.కొనుగోలు చేసిన ధాన్యం సురక్షితంగా నిల్వ ఉండేందుకు జిల్లాలో రెండు ప్రైవేట్ గోదాములను అద్దెకు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ధాన్యం తూకాల్లో పారదర్శకత కోసం పటిష్ట చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు.కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, జిల్లాలో 15,540 టార్పాలిన్లు, 668 తూకం యంత్రాలు, 278 ప్యాడీ క్లీనర్లు, 664 తేమ శాతం కొలిచే యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.రైతులు ప్రభుత్వ మద్దతు ధరకే తమ ధాన్యాన్ని విక్రయించి ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
ఏ2డిజిటల్ న్యూస్, మే 8, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
రైతులు ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రంగంపేట పశువైద్యాధికారిని డాక్టర్ ప్రియాంక అన్నారు.శుక్రవారం మండలకేంద్రమైన కూల్చారం హాస్పిటల్ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పశుగణాభివృద్ది సంస్థ మెదక్ మరియు కూల్చారం పశువైద్య, పశుసంవర్ధక వారి అద్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పశువైద్యదికారిని ప్రియాంక మాట్లాడుతూ పశు పోషకులు వేసవిలో పశువులకు వడ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏవైనా పశువులు అనారోగ్యంతో ఉన్నట్లు అయితే వెంటనే తమ సిబ్బంది కి తెలపాలని అన్నారు.ఈ రోజు నిర్వహించిన శిబిరంలో 10 ఉచిత కృత్రిమ గర్భధారణ,28 దూడలకు నట్టాల నివారణకు మందులు త్రాగించడం,20 గర్భకోశ వ్యాధులను గుర్తించి చికిత్స,సాధారణ చికిత్సలు 14 పశువులకు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దేవన్నగారి శేఖర్ మాట్లాడుతూ.. పశుసంవర్ధక శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని తమ పశువులను కాపాడుకోవాలని,ఏవైనా సమస్యలు ఉంటే పశువైద్యులకు తెలియజేయాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోరంపల్లి రాణి గోపి లైవ్ స్టాక్ అసిస్టెంట్ చెన్నయ్య, వెటర్నరీ అసిస్టెంట్ కీర్తి,సిబ్బంది మహిపాల్, గోపాల మిత్ర ప్రవీణ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఏ2డిజిటల్ న్యూస్, మే8, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
మెదక్ మున్సిపాలిటీ లోని ఆరో వార్డు జమ్మికుంట కాలనీలో టి యు ఎఫ్ ఐ డి సి, ఎస్ డి ఎఫ్, ఎస్ బి ఎం పథకాల కింద మంజూరైన 39 లక్షల 50 వేల రూపాయల సిసి రోడ్డు పనులను స్థానిక వార్డు కౌన్సిలర్ కొడకంటి హరిత ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులను మెదక్ ఎమ్మెల్యే బైనంపల్లి రోహిత్ రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. అనంతరం కమ్యూనిటీ హాల్లో బోరు మోటార్ ప్రారంభించారు. స్థానిక కౌన్సిలర్ కొడకంటి హరిత ఆధ్వర్యంలో జరిగినఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్, సుభాష్ చంద్రబోస్, సంఘశ్రీకాంత్,రామస్వామి,ముజాంబిల్ ,సిద్ధిరాములు ,పింకు, రింకు, ప్రేమ్ సాగర్ , సుమన్ కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఏ2డిజిటల్ న్యూస్, మే8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ వేగవంతం అవుతోంది.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్పందనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.ధర్మసాగర్ గేటు వద్ద స్వయంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పర్యవేక్షణలో వరి ధాన్యాన్ని తరలించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు.శుక్రవారం కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.ఇప్పటివరకు ఎంత ధాన్యం వచ్చిందీ, ఎంతమంది రైతులకు టోకెన్లు జారీ చేశారో, ఎంత మేర కొనుగోలు జరిగిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.లారీలు సమయానికి రావాలని, లోడింగ్–అన్‌లోడింగ్ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు.ట్రక్‌తో పాటు నిర్వాహకుల ప్రతినిధి తప్పనిసరిగా వెళ్లి మిల్లుల్లో ధాన్యం త్వరగా అన్‌లోడ్ అయ్యేలా చూడాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో గానీ, మిల్లుల వద్ద గానీ సమస్యలు తలెత్తితే వెంటనే రాతపూర్వకంగా తెలియజేయాలని రైతులకు తెలిపారు.సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడిన అదనపు కలెక్టర్ నగేష్…ఇప్పటివరకు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి, 14 వేల మంది రైతుల ఖాతాల్లో 52 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వెల్లడించారు.రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.అకాల వర్షాల కారణంగా ధాన్యాన్ని రక్షించేందుకు టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.లోడింగ్ ప్రక్రియను వేగంగా చేపట్టాలని, అవసరమైన లేబర్, లారీలను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.నిబంధనల మేరకు తేమ శాతం ఉండేలా చూడాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు ఆదేశించారు.మిల్లర్లు కూడా ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి : అదనపు కలెక్టర్ నగేష్
ఏ2డిజిటల్ న్యూస్, మే 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కేంద్ర నిర్వాహకులతో మాట్లాడిన అదనపు కలెక్టర్, ఇప్పటివరకు కేంద్రానికి ఎంత ధాన్యం వచ్చిందీ, ఎంతమంది రైతులకు టోకెన్లు జారీ చేశారో, ఎంత మేర కొనుగోలు పూర్తయ్యిందో అడిగి తెలుసుకున్నారు. అలాగే లారీలు వచ్చే సమయం, లోడింగ్ – అన్‌లోడింగ్ ప్రక్రియకు పడుతున్న సమయం వంటి వివరాలను పరిశీలించారు.ధాన్యం రవాణాలో ఆలస్యం జరగకుండా చూడాలని, లారీతో పాటు కేంద్ర నిర్వాహకుల తరఫున ఒక ప్రతినిధి తప్పనిసరిగా మిల్లుకు వెళ్లి ధాన్యం త్వరగా అన్‌లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గానీ, మిల్లుల వద్ద గానీ ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే రాతపూర్వకంగా తమ దృష్టికి తీసుకురావాలని, తక్షణ చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు రైతుల నుంచి 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 14 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.52 కోట్లను జమ చేసినట్లు వెల్లడించారు.రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. లోడింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన లేబర్, లారీలను సిద్ధంగా ఉంచుకోవాలని, నిబంధనల మేరకు తేమ శాతం ఉండేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే మిల్లర్లు ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏ2డిజిటల్ న్యూస్, మే 7, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
పాపన్నపేట మండలం అన్నారం గ్రామ శివారులోని ప్రకృతి వనం వెనుక పేకాట ఆడుతున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని నగదు, సెల్‌ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అరెస్టైన వారిలో దర్శనం రాజు (32), దర్శనం వినోద్‌కుమార్ (29)లు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.8,500 నగదు, రెండు సెల్‌ఫోన్లు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో జూదం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సమన్వయంతో నిరంతరం దాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.
ఏ2డిజిటల్ న్యూస్, మే 7, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
కొల్చారం మండలం పోతాం శెట్టిపల్లిలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జరిగిన రైతు వరము సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ దేశం వ్యవసాయ ఆధారిత దేశమని, రైతులు వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వంగడాలు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను వినియోగించడం ద్వారా పంటల ఉత్పత్తిని పెంచుకోవచ్చన్నారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, స్థానిక తహసిల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు.