Thursday, May 7, 2026
Home Blog Page 14

రేణుక ఎల్లమ్మ కృపతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 14 చిన్న శంకరంపేట:-(కమ్మరి దేవరాజు)

రేణుక ఎల్లమ్మ అమ్మవారి కృపతో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మెదక్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటలో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవం నిర్వహించారు. పద్మ దేవేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోలుకూరి లక్ష్మారెడ్డి, సత్యనారాయణ, అంబాజీపేట కొమురవెల్లి నార గౌడ్, సుంకరి చంద్ర గౌడ్, కొమురవెల్లి మల్లేష్ గౌడ్, సుంకరి ఏళ్ళ గౌడ్, సుంకరి స్వామి గౌడ్, సాన మోహన్, రాజ్ కుమార్, తాళ్ల ఈశ్వర్, సుంకరి నాగరాజు, సుంకరి ప్రభు గౌడ్, కొమురవెల్లి బన్నీ, విఠల్, నర్సింలు పాల్గొన్నారు.

30 ఏళ్ల సొంతింటి కల నెరవేరింది–లబ్ధిదారునికి ఆనందానికి అంతే లేదు

0

ఏ2టీవీ న్యూస్,ఏప్రిల్ 14:-చిన్నశంకరంపేట ప్రతినిధి,( కమ్మరి దేవరాజు)

30 ఏళ్లుగా సొంత ఇంటి కోసం ఎదురుచూస్తూ అద్దె ఇంట్లో నివసిస్తూ ఇంటి కోసం అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఇల్లు మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో నే ఇందిరమ్మ కమిటీ ద్వారా ఇల్లు మంజూరు కావడంతో ఆ ఇంటి యజమాని కుటుంబీకులు సంతోషానికి హద్దులు లేవు. నార్సింగ్ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన నాగులు గారి అశోక్ గౌడ్ 30 ఏళ్ల నుండి ఇల్లు లేక ఇంటి అద్దెలో ఉంటూ పెయింటర్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో ఇందిరమ్మ కమిటీ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ దృష్టికి తీసుకువెళ్లి ఇల్లు మంజూరు చేయించి మంగళవారం సర్పంచ్ సంతోష గొండస్వామి ఉప సర్పంచ్ విజయకుమార్ చేతుల మీదుగా ఇల్లు ప్రోసిడింగ్ కార్డ్ ఆర్డర్ ను అశోక్ గౌడు కు అందించారు. స్వామి, ఉప సర్పంచ్ విజయకుమార్ చేతుల మీదుగా అందించారు. అనంతరం లబ్ధిదారుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ, తన ఇల్లు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

వడగాలులపై అప్రమత్తం కావాలి – కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచనలు

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. వడగాలుల ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, జిల్లా పరిపాలన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.అన్ని శాఖల సమన్వయంతో తాగునీటి సరఫరా, చలివేంద్రాల ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాల్లో ORS మరియు మందుల నిల్వలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కార్మికులు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని సూచించారు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.జిల్లాలో బస్ స్టాండ్లు, మార్కెట్లు, పనిస్థలాల్లో తాగునీరు, నీడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వడగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బి.ఆర్.అంబేద్కర్ జయంతి

0

ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 14, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)

మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు శాఖమూరి యాదగిరి ఇతర నాయకులు కలిసి స్థానిక చిల్డ్రన్ పార్కులో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని అన్నారు. రాజ్యాంగాన్ని విద్యార్థులకు ప్రత్యేక సబ్జెక్టుగా చేర్చాలని, రెండు తెలుగు రాష్ట్రాలు భారత రాజ్యాంగాన్ని విద్యార్థులకు ఉచితంగా అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అడుగు జాడల్లో నడవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాందాస్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాతగా, షెడ్యూల్ కులాల మార్గదర్శకుడిగా డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలు అపారమన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల విశేషాలను సమన్వయం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం అంబేద్కర్ గొప్పతనమన్నారు. ఆయన దూరదృష్టి వల్లే దేశంలో ప్రజాస్వామ్యం బలపడిందని, ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు.జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించిందని, సమాజంలో శాంతి, సామరస్యానికి దోహదపడుతోందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, డిఆర్డిఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎఫ్ఓ జో.జి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆకుల పెంటయ్య, దుబాషి సంజీవ్, గరుగుల శ్రీనివాస్, దుర్గాప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మహానీయుడికి ఘన నివాళులు –చిన్నశంకరంపేటలో అంబేద్కర్ జయంతి వేడుకలు.

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 14 చిన్న శంకరంపేట(ప్రతినిధి కమ్మరి దేవరాజు)

భారత రాజ్యాంగ నిర్మాత 135వ జయంతి సందర్భంగా మంగళవారం చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ముత్తిగళ్ల రామచందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆలు పెరగని పోరాటం చేసి కుచ్ చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ఆయన అడుగుజాడలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్తిగల రామచంద్రం, సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్, ఉప సర్పంచ్ హేమ భాను ప్రసాద్ ,మాజీ సర్పంచ్లు శ్రీమన్నారాయణ రెడ్డి, రాజిరెడ్డి, ఎస్సై నారాయణ గౌడ్, ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రెపోచయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు మురళి మాదిగ, రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు, మాల మహానాడు వ్యవస్థాపకులు బొమ్మరబోయిన మైసయ్య, దొంత దుర్గపతి, కర్నే సాయిలు, చెట్లపల్లి యాదగిరి, సడిమెల నారాయణ, ఎరుకల గంగ, ఎండి. జహంగీర్, ఉడుత శ్రీమన్, ఎండి జావిద్, నాగరాజు, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలముందుఇచ్చినహామీలకు కట్టుబడి ఉన్న అప్పాజీపల్లిసర్పంచ్ వెంకట్ గౌడ్( గజిని)

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 14 నర్సాపూర్ నియోజకవర్గ (బుచ్చన్న)

గత సర్పంచ్ ఎన్నికలలో తాను గెలిస్తే గ్రామంలో పుట్టిన ప్రతి ఆడ పిల్ల పేరున 5116 రూపాయలు ప్రోత్సాహంగా అందిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని గ్రామంలోని శివలింగారి జ్ఞానేశ్వర్ కు ఆడపిల్ల జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకొని వారి ఇంటికి వెళ్లి దంపతులకు 5116 రూపాయల ప్రోత్సాహాకాన్ని అందజేసినట్లు సర్పంచ్ వెంకట్ గౌడ్ (గజిని) తెలిపారు. అలాగే గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామంలో సిసి రోడ్డులు పలు అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ చలం నర్సింహులు, దాది కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నాయినిజలాల్ పూర్ లో రోడ్డు భద్రత అవగాహన…పాల్గొన్న ఎంపీడీవో ఉన్నిసా బేగం

0

ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 14,నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాయిని జలాల్పూర్ గ్రామంలో రోడ్డు భద్రత రోడ్డుపై జరిగే ప్రమాదాల పై అవగాహన కార్యక్రమం గ్రామసభ గ్రామ సర్పంచ్ దేవీ సింగ్ ఉపసర్పంచ్ వెంకట నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారికంగా పాల్గొన్నఎంపీడీవో ఉన్నిసా బేగం మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అత్యధిక వేగం ప్రమాదాలకు నిలయంగా మారుతుందని ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ప్రమాదాలను నివారించాలని గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం గ్రామంలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రోడ్డు సేఫ్టీపై ప్రత్యేక గ్రామ సభ – ప్రజల్లో అవగాహన పెంపు

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 14 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

చేగుంట(13) ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 492 గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ గ్రామ సభలలో భాగంగా పులిమామిడి గ్రామంలో ప్రత్యేక రోడ్డు సేఫ్టీ గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ రషీద్, పంచాయతీ కార్యదర్శి సబిత, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ— మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం అని మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు గ్రామస్థులు ఈ కార్యక్రమానికి హాజరై రోడ్డు భద్రతపై కీలక సూచనలు తెలుసుకున్నారు.

ఆదర్శ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 14, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2025-26 విద్యా సంవత్సర ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరచి ఉత్తమ ఫలితాలు సాధించారు.ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోబైపీసీ విభాగంలో పావని 946/1000 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది.సీఈసీ విభాగంలో మేఘన 927/1000,ఎంపీసీ విభాగంలో రేణుశ్రీ 903/1000,ఎంఈసీ విభాగంలో శృతి 874/1000 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.అలాగే, ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లోఎంపీసీ విభాగంలో హర్షిత 460/470 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా,సీఈసీ విభాగంలో తేజ 445/500,బైపీసీ విభాగంలో పూజ 411/440,ఎంఈసీ విభాగంలో లోకేష్ రెడ్డి 315/500 మార్కులు సాధించారు.ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను “ఆదర్శ పాఠశాల ఆణిముత్యాలు”గా కొనియాడుతూ, వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.స్థానిక సర్పంచ్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్, గ్రామ పాలకమండలి సభ్యులు, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వాణి కుమారి మరియు అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించి ఘనంగా సన్మానించారు.