Thursday, May 7, 2026
Home Blog Page 15

నీటి వినియోగంపై చందాపూర్ ఎంపిక

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 14,చిన్నశంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతిలో భాగంగా సోమవారం సర్పంచ్ చెన్నాగౌని కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో జల జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ హర్ ఘర్ జెల్ కింద చందాపూర్ గ్రామం ఎంపికైనట్లు మిషన్ భగీరథ ఏఈ స్వప్న తెలిపారు. నీటి వినియోగంపై వేసవి దుష్ట్యా నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సర్పంచ్ చెన్నాగోని కృష్ణ గౌడ్ సూచించారు. గ్రామంలో వృధా నీటిని అరికట్టాలని ప్రతిజ్ఞ చేశారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ స్వప్న సర్పంచ్ కృష్ణ గౌడ్ కు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

నో హెల్మెట్ – నో ఎంట్రీ: నందగోకుల్ గ్రామంలో వినూత్న కార్యక్రమం

0

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచన – అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలి

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 13, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలోని 492 గ్రామపంచాయతీలలో ‘అరైవ్ అలైవ్’ గ్రామ సభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాంపేట్ మండలం నందగోకుల్ గ్రామంలో గ్రామ సభ సందర్భంగా గ్రామస్తులు వినూత్నంగా “నో హెల్మెట్ – నో ఎంట్రీ” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి గ్రామస్తులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణ రక్షణ కోసం నందగోకుల్ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని “నో హెల్మెట్ – నో ఎంట్రీ” కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతి వ్యక్తి సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకోవాలంటే రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి కారణాల వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని హెచ్చరించారు.జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుంటే, తెలంగాణలోనే సుమారు 7,000 మంది మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో ఇతర నేరాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం ప్రధాన కారణమని తెలిపారు.ప్రతి ఒక్కరూ నందగోకుల్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని హెల్మెట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా ఒక కానిస్టేబుల్ మిమిక్రీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి దేవకుమార్, సర్పంచ్ భాను, ఎంపీడీవో రాజిరెడ్డి, సీఐ వెంకటరాజా గౌడ్, డీఎస్పీ నరేందర్ గౌడ్, పోలీసు సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

మాందాపూర్ తండాలో ఉచిత వైద్య శిబిరం

0

ఏ 2టీవీ న్యూస్, ఏప్రిల్13,చిన్నశంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

చిన్నశంకరంపేట మండలంలోని మాందాపూర్ పంచాయతీ తాండాలో మల్లారెడ్డి హాస్పిటల్ వైద్య బృందం సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి సర్పంచ్ అశోక్ నాయక్ ఆధ్వర్యంలో జరగా రోగులు పెద్ద ఎత్తున తరలివచారు. వైద్యులు వచ్చిన రోగులకు బిపి షుగర్ తదితర దీర్ఘకాలిక రోగులకు పరీక్షలు చేసి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ నాయక్, పంచాయతీ కార్యదర్శి గణేష్, వార్డు సభ్యులు మోహన్, గణేష్ చంద్రపాల్ గ్రామ పాల్గొన్నారు.

తుక్కాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన. వీ పి ఓ మహేష్.

0

ఏ2టీవీ న్యూస్,ఏప్రిల్ 13, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

సోమవారం తెలంగాణ ప్రభుత్వం సూచన ప్రకారం తుక్కాపూర్ లో సర్పంచ్ దొడ్లే ఆంజనేయులు అధ్యక్షతన రోడ్డు భద్రత నియామవలి లో భాగంగా తుక్కాపూర్ లో వాహన దారులకు ప్రజలకు సూచనలు చేస్తున్న విలేజ్ పోలీస్ ఆఫీసర్ మహేష్ వాహనాల నడిపే వారికి పలు సూచనలు చేశారు. అందులో భాగంగా ప్రతి వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తమ ప్రాణాల రక్షణకై హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు. అంతేగాకుండా చిన్నపిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు తప్పులు చేయరాదని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టరీత్యా చర్యలు చేపడతామణి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు భద్రత ప్రజలతో ప్రమాణం చేయడం జరిగింది,,, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ఉప సర్పంచ్, అంగన్వాడి,ఆశా వర్కర్, ఫీల్డ్ అసిస్టెంట్,డీలర్,మరియు గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 13,చిన్నశంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

ప్రభుత్వం రైతులకు ధాన్యానికి గిట్టుబాటు కల్పించాలని పీఏసీఎస్ ఆధ్వర్యంలో జంగరాయి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా తాసిల్దార్ మాలతీ, సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎండలు తీవ్రంగా ఉన్నందున రైతులకు ధాన్యం కొనుగోలు కోసం ఇచ్చిన టోకెన్ల ద్వారానే గ్రామబద్దీకరణలో ధాన్యాన్ని సేకరించాలని అన్నారు ప్రభుత్వం రైతుల పండించిన రైతులకు ఏ గ్రేడ్ రకానికి రూ 2389, బి రకానికి రూ. 2369 మద్దతు ఇస్తుంద ని తెలిపారు. సన్న రకం ధాన్యానికి అదనంగా 500 బోనస్ ఇస్తుంది అని తెలిపారు. దళాలకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆవుల గోపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాలకృష్ణయ్య, గడ్డం సురేష్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్ లోప్రజాపాలన ప్రగతి ప్రణాళికవార్డు సభ

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 13 నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి(బుచ్చన్న)

నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక వార్డు సభలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ , ఎస్‌ఐ రంజిత్ కుమార్ , ఎం.ఆర్.ఓ శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారుఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు తెలిపారు. అలాగే యువత ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస కాకుండా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. సజీవంగా చేరుకోండి అనే సందేశంతో ప్రజల్లో అవగాహన పెంపొందించారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ సురక్షితమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.ట్రాఫిక్ నియమాలు పాటించండి – సురక్షితంగా చేరండినెమ్మదిగా నడపండి – ఇంటికి సురక్షితంగా చేరండి మొబైల్ కాదు – మీ లక్ష్యం ముఖ్యం

కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బియ్యంపంపిణీ చేయాలి:అదనపు కలెక్టర్ నగేష్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 13,నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ చౌకదారుల దుకాణంను ఆదివారము అదనపు కలెక్టర్ నగేష్ తనిఖీ చేశారు. రికార్డులను, బియ్యం విలువలను పరిశీలించి రేషన్ కార్డు దారులతో మాట్లాడారు, కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని డీలర్ కు సూచించారు,పిడిస్ లో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రేషన్ షాప్ డీలర్లు సమయపాలన పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అరైవ్ అలైవ్ గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

0

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 12, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కీలకంగా నిర్వహించనున్న “అరైవ్ అలైవ్” గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలోని 492 గ్రామపంచాయతీలలో గ్రామ సభలను పటిష్టంగా నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు.ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం నుండి గూగుల్ మీట్ ద్వారా ఆర్డీవోలు, జిల్లా అధికారులు, అన్ని మండలాల ఎంపీడీవోలు, డీఎస్పీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో గ్రామ సభలు నిర్వహించాలని పేర్కొన్నారు.గ్రామ సభలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలియజేసిన ఆమె, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సభల కోసం బ్యానర్లు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.గ్రామ సభల్లో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే సందేశం, అతివేగం నివారణ వంటి అంశాలపై చైతన్యం కల్పించాలని సూచించారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ప్రమాదాలను తగ్గించడం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.గ్రామస్థాయిలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసి, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీలలో రిటైర్డ్ టీచర్లు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు.మద్యం సేవించి, అతివేగంగా లేదా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలను ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు.ఈ గూగుల్ మీట్‌లో అదనపు కలెక్టర్ నగేష్, సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, డీఎస్పీలు పాల్గొన్నారు.

జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు తూప్రాన్‌లో ఘనంగా నిర్వహణ

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 11,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రెటరీ, కేశవ అసోసియేషన్ అధ్యక్షుడు శివ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పూలేకు ఘన నివాళులర్పించారు.జయంతి సందర్భంగా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, ఆయన సమాజ సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, విద్యా విస్తరణ కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శివ గౌడ్, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్, జిల్లా జనరల్ సెక్రెటరీ హిమాపురం వెంకటేష్ గౌడ్, మనరాబాద్ మండల అధ్యక్షుడు లాలేష్ గౌడ్, తూప్రాన్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గజ్జల కృష్ణతో పాటు పర్సా సాయికుమార్, శ్రీకాంత్, బాయికాడ ముత్యాలు, గౌటి బాలేష్, స్వర్గాల నాగులు, ఎం. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏ2టీవీ ప్రభావం… పాఠశాల పరిసరాలు శుభ్రం

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాల పరిసరాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారంపై ఏ2టీవీ రెండు రోజుల క్రితం ప్రచురించిన వార్త కథనం ఫలితాన్ని ఇచ్చింది.పాఠశాల గోడ అవతలి భాగంలో చెత్తను పారవేస్తుండటాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం స్పందించింది.ఈరోజు చెత్తాచెదారాన్ని తొలగిస్తూ, వాటిని కాల్చివేసి పరిసరాలను శుభ్రపరిచింది.స్థానికులు ఏ2టీవీ చొరవను అభినందిస్తూ, సమస్యలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.