Thursday, May 7, 2026
Home Blog Page 17

ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు – నాణ్యమైన బియ్యం, మెరుగైన వైద్యం అందాలి: అదనపు కలెక్టర్ నగేష్

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 7, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు కీలక సూచనలు చేశారు.రామాయంపేట ప్రభుత్వ పాఠశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను పరిశీలించిన ఆయన, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.తదుపరి రామాయంపేట ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, ప్రజలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని సూచించారు. స్టాక్ వివరాలను తెలుసుకుంటూ పంపిణీ వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు.నిజాంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, రోగులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. రోగులకు అవసరమైన పరీక్షలు ఉచితంగా అందించాలని సూచించారు.అనంతరం నిజాంపేట తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన నగేష్, భూ భారతి మరియు ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా తక్షణమే పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. భూ సర్వే, ఇసుక సమస్యలపై కూడా వివరాలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కోనాపూర్‌లో రూ.6 లక్షలతో సిసి రోడ్డు పనుల ప్రారంభం

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 7, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ మోత్కు నిర్మల మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షుడు సంతోష్ రావు ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులుగా రూ.6 లక్షలతో ఈ పనులు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కోనాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అలాగే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహకారంతో మరిన్ని నిధులను తీసుకువచ్చి గ్రామ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

గేయ రచయితగా రాణిస్తున్న నర్సాపూర్ యువకుడు

0

ఏ2టీవీ న్యూస్ నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)

మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణానికి చెందిన శ్రీకృష్ణ అనే యువకుడు సినీ రంగంలో గేయ రచయితగా రాణిస్తున్నాడు. ఇప్పటికీ రెండు సినిమాల్లో పాటలు రాసి అందరి మన్ననలు పొందుతున్న శ్రీకృష్ణ మొదట సినిమాలపై ఆసక్తితో శ్రీకృష్ణ గ్రిల్లర్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్థాపించి పలు షార్ట్ ఫిలింలు, పాటలు తీశాడు. అంతేకాకుండా తన ప్రయత్నం ఆపకుండా సినిమా రంగంలో కూడా తనకున్న టాలెంట్ తో గేయ రచయితగా రాణిస్తున్నాడు గేయ రచయితగా ”ఏందిరా ఈ పంచాయతీ” అనేది తన మొదటి సినిమా కాగా డైమండ్ డెకాయిట్ అనేది తన రెండవ సినిమా అని తెలిపారు. ఎవరి అండదండలు లేకుండా తనంతట తానుగా కష్టపడుతున్న శ్రీకృష్ణను ఏ2టీవీ న్యూస్ పలకరించగా సినిమాలపై ఆసక్తి కొద్ది మొదటగా సినిమా రంగంలో ప్రయత్నిస్తూ ఆక్రమంలోని శ్రీకృష్ణ గ్రిల్లర్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్థాపించి పలు పాటలు లఘు చిత్రాలు తీశానని నా ఆసక్తి గమనించి సినిమాల్లో పాటలు రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఏందిరా ఈ పంచాయతీ తన మొదటి సినిమా సాంగ్ కూడా అందరి మన్ననలు పొందడం సంతోషంగా ఉందని, రెండో సినిమా డైమండ్ డెకాయిట్ కూడా తనదైన శైలిలో పాటల ప్రేమికులకు నచ్చడం తనకు మరింత సంతోషాన్ని కలిగించడమే కాకుండా మరిన్ని మంచి పాటలు రాయాలి అన్న బాధ్యత కూడా పెంచిందని ఆయన తెలిపారు. నా రెండవ సినిమా డైమండ్ డెకాయిట్ చిత్రం లో పాట రాసే అవకాశం కల్పించిన మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ అన్న, సినిమా డైరెక్టర్ సూర్య జి యాదవ్, సినిమా హీరో పార్ధ గోపాల్, ప్రొడ్యూసర్ మునిగోపాల్ లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకృష్ణ ఇలాగే సినిమా రంగంలో తనదైన ముద్రవేయాలని మనము ఆశిద్దాం.

ఏఐపై కట్టడి అవసరం…!

0

ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 7, బ్యూరో(మల్పర్తిరాంచందర్)

ప్రస్తుతం ఏ ఐ పై కట్టడి అవసరమా అంటే అవసరమనే చెప్పాలి. ఎందుకంటే దీనివల్ల ప్రజలకు, తయారీదారులకు ప్రయోజనం ఎంతవరకో తెలియదు కానీ అనైతిక కార్యక్రమాలకు ముఖ్యమైన ప్లాట్ఫారం గా మారి ప్రజల మనోభావాలతో ఆటలాడే పరిస్థితి తలెత్తింది. అసలు ఈ ఏఐ అంటే ఒక సాఫ్ట్వేర్ దీని ద్వారా పాత ఫోటోలను మనం కూడా సంబ్రమాశ్చర్యాలకు గురయ్యేలా కొత్తదిగా మార్చడం దీనికి ఉన్న ప్రత్యేకత. అంతేకాదు మరోవైపు అనైతిక కార్యక్రమాలకు పాల్పడడం కూడా దీనివల్ల, దీని ఆధారిత మరో ఇతర సాఫ్ట్వేర్ల వల్ల కూడా అవుతుంది. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు ఇప్పటికే మహిళల చిత్రాలను వివస్త్రగా చేసి అట్టి ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతుంటారు. వాట్సాప్ లో గాని మరే ఇతర సోషల్ మీడియాలో కానీ ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోకు రూపం ఇచ్చి నగ్నంగా తయారు చేయడం ఇలాంటి సాఫ్ట్వేర్లతో చాలా సులువు. కానీ ఆ మహిళల మనోభావాలు దెబ్బతిని వాళ్ళ కుటుంబ పరువు రోడ్డున పడితే అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు. ఇలాంటి పైశాచికత్వం ఎందుకు దేనికోసం ? మామూలు వాళ్లే కాకుండా సినిమా హీరోయిన్ ల సైతం ఫోటోలు ఈ సాఫ్ట్వేర్ తో వివస్త్రగా చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. రెగ్యులర్గా సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఇది సుపరిచితమే. ఇందులో మన ఫోటో కూడా ఏఐ సాయంతో క్లియర్ చేసుకుంటే అసలు ఏదో నకిలీ ఏదో గుర్తుపట్టలేనంత విధంగా ఉండటం ఇలాంటి సాఫ్ట్వేర్లకు ఉన్న ప్రత్యేకత. దీనిని మంచికి ఉపయోగిస్తే పరవాలేదు కానీ ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు వినియోగిస్తే మాత్రం మహిళల మనోభావాలు దెబ్బ తినడం తద్వారా వాళ్ళ కుటుంబాలు కుటుంబ పరువు బజార్లో పడటం ఇలాంటి అనేక దుస్సంఘటనలు జరుగుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొత్త కొత్త సాఫ్ట్వేర్ల పుణ్యమా అని మహిళల ఫోటోలను కృత్రిమ మేధా సాయంతో వివస్త్రగా చేసి సోషల్ మీడియాలో పెడితే కొన్ని లక్షల సార్లు షేర్ చేసినట్లు డేటా చూస్తే తెలుస్తుందని సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఇంటర్నెట్ ఆధారిత సంస్థలు పేర్కొంటున్నాయి. ఇలాంటి సాంకేతికతను సాఫ్ట్వేర్లు డెవలప్ చేస్తున్నట్లయితే వారు నేరం చేస్తున్నట్లే లెక్క. దీన్ని అడ్డుకోవడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ ని కూడా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమ్మతి లేకుండా మహిళల ఫోటోలను అసభ్యకర రీతిలో పెట్టడం రివెంజ్ పోర్న్ గా వ్యవహరిస్తారు. ఇది ప్రజల జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు, యువకులు అనే తేడా లేకుండా అందరూ మొబైల్ కు బానిసలు అయ్యారు కాబట్టి విపరీతమైన దుష్పరిణామాలు చూపుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆన్లైన్లో మహిళల ఫోటోలను అసభ్యకర రీతిలో పెట్టడం తీవ్ర నేరంగా పరిగణించాలి. డిజిటల్ పద్ధతుల్లో మహిళల నగ్న చిత్రాలను రూపొందించడం సోషల్ మాధ్యమాల్లో పెట్టడం ఇవి ఇంకా పూర్తిస్థాయి చట్టపరిధిలోకి రావట్లేదు కాబట్టి ఇలాంటివి జీవితాలపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి వీటిని కూడా లైంగిక నేరంగా పరిగణించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ముందు ముందు ఇంకెన్ని దుష్పరిణామాలు ఉంటాయో! మామూలు సాఫ్ట్వేర్లతోనే ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయగా కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. కొన్ని కుటుంబాల పరువు బజార్లో పడ్డ సంఘటనలు ఉన్నాయి. ఇక ఇలాంటి అధునాతన సాఫ్ట్వేర్ల సహాయంతో కేటుగాళ్లు ఇలా రెచ్చిపోతే ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు కాబట్టి దీన్ని కూడా లైంగిక నేరంగా పరిగణించాల్సిందే. మామూలు మహిళలు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎవరి ఫోటోలు కూడా ఈ సాఫ్ట్వేర్ బారిన పడకుండా చూసి అలా ఎవరైనా పాల్పడితే వారిని కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి. అటు ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి దృష్టి సారించి కట్టుదిట్టం చేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇలాంటి సాఫ్ట్వేర్లను బ్యాన్ చేసి ఇకముందు కూడా రాకుండా చూడాలి. సైబర్ క్రైమ్ కూడా డేగకన్ను వేసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తే ఇలాంటి వికృత చేష్టలు కట్టడి కావు అని పలువురుఅభిప్రాయపడుతున్నారు.

పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ చేయాలికలెక్టర్‌కు విన్నవించిన జనసేన పార్టీ నాయకులు

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 6, నర్సాపూర్ ప్రతినిధి (రామ్ చందర్)

డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు గుర్తించి వెంటనే పంపిణీ చేయాలని జనసేన పార్టీ నాయకులు సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్‌ను కలిసి విన్నవించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సాపూర్ డివిజన్ నాయకుడు శాఖమూరి యాదగిరి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇప్పటివరకు లబ్ధిదారులకు అందజేయలేదని పేర్కొన్నారు. అవి ఖాళీగా ఉండడం వల్ల శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.పట్టణంలోని అర్హులైన పేదలను గుర్తించి, ఆ ఇండ్లను తక్షణమే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యకరమైన జీవనానికి “ఈట్ రైట్ – వాక్”జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపు

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 6, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

సరైన ఆహారం – ఆరోగ్య భవిష్యత్తు” వంటి నినాదాలతో ప్లేకార్డులు పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగింది. రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ హెల్త్ వీక్ కార్యక్రమంపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు నుండి వారం రోజులపాటు హెల్త్ వీక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం” అని తెలిపారు. శారీరక ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరమని, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి సహజ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.“ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన సంపద లేదు” అని పేర్కొన్నారు. ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, కార్బోహైడ్రేట్స్‌ను పరిమితంగా తీసుకోవాలని సూచించారు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే అవసరమని చెప్పారు. హెల్త్ వీక్ సందర్భంగా: ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ వర్కర్లకు సత్కారం ఏప్రిల్ 8: రక్షిత మాతృత్వ దినోత్సవం – సురక్షిత ప్రసవాలపై అవగాహన ఏప్రిల్ 9: ఎయిడ్స్ నియంత్రణపై “రెడ్ రన్” కార్యక్రమం ఏప్రిల్ 10: హోమియోపతి, ఆయుష్ దినోత్సవం – యోగా, ఆరోగ్య శిబిరాలు ఏప్రిల్ 11: మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన, విద్యార్థులకు పోటీలు ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ డాక్టర్ శివదయాల్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎఫ్ఓ, డీఈఓ విజయ, బీవో హేమభార్గవి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, క్రీడాశాఖ అధికారి రమేష్, మత్స్యశాఖ అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

రాజిరెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ .. మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్

0

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 6, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి సహకారంతో కొల్చారం మండలానికి చెందిన పలు కుటుంబాలకు సుమారు పది లక్షల రూపాయల విలువగల ఏంఆర్ఎఫ్ చెక్కులను 34 మందికి అందజేయడం జరిగిందని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హంసాన్పల్లి మాజీ సర్పంచ్ మన్నే శ్రీనివాస్, చిన్న ఘనపూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి పలు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు.

ఎమ్మెల్యే జన్మదిన పురస్కరించుకొని హోమం పూజలు నిర్వహించిన శశిధర్ రెడ్డి

0

ఏ2టివి న్యూస్, ఏప్రిల్ 6, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా చాకరిమెట్లు శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే సునీత రెడ్డి తనయుడు శశిధర్ రెడ్డి వేద పండితులు ఆంజనేయ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య హోమం,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కోసం భక్తులు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానిక ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.అనంతరం నర్సాపూర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నర్సాపురం పట్టణంలో రెండవ విడత జాబ్ మేళా విజయవంతం.. ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ.

0

ఏ2టీవీ న్యూస్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ( బుచ్చన్న)

నర్సాపుర్ పట్టణంలోనీ శ్రీ సాయి కృష్ణా గార్డెన్స్ లో నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవ జాబ్ మేళా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం సుమారు 600 మంది యువత హాజరై ఉద్యోగ అవకాశాల కోసం పాల్గొన్నారు.జాబ్ మేళాలో వివిధ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశాయి. అందులో భాగంగా 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభించగా, మరో 150 మంది అభ్యర్థులు తదుపరి దశల కోసం షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు.ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తన ముఖ్య లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగ యువతకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత ఆవుల రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని కోరారు.

పులిమామిడిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

0

ఏ2టీవి న్యూస్, ఏప్రిల్ 6, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా(5) చేగుంట మండలం పులిమామిడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామ అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని జగ్జీవన్ రామ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.